Telugu News » Vemulawada : ఖాళీ అవుతున్న కమలం.. కారెక్కనున్న కీలక నేత..!!

Vemulawada : ఖాళీ అవుతున్న కమలం.. కారెక్కనున్న కీలక నేత..!!

తుల ఉమ విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ఆమె మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తుల ఉమ పార్టీ మారడం సరైన నిర్ణయం అని ఆమె అనుచరులు మద్దతిస్తున్నారు.

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికలకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. అయినా వలసలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సారిగా గ్రాఫ్ పెంచుకున్న బీజేపీ (BJP) మునుగోడు ఉపఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఉలుకుపలుకు లేకుండా ఉండటం దూకుడు ప్రదర్శించక పోవడంతో చర్చకు దారితీసింది.

ఇదే సమయంలో సీట్ల సర్ధుబాటు విషయంలో ఏర్పడ్డ సమస్య వల్ల కరీంనగర్ (Karminagar) మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ (Tula-Uma)బీజేపీకి షాకిచ్చారు. కమలంకు గుడ్ బై చెప్పిన తుల ఉమ.. బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. నిజానికి వేములవాడ (Vemulawada)లో బీజేపీ టికెట్ ఆశించారు తుల ఉమ.. మరోవైపు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించి ఉమను ఈ నియోజక వర్గ అభ్యర్థిగా ప్రకటించారు.. కానీ బీఫామ్ ఇవ్వకపోవడంతో.. వేములవాడ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి.

అంతలోనే ఆమె బదులు చెన్నమనేని వికాస్ రావ్‌ ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇచ్చింది కమలం అధిష్టానం.. ఊహించని ఈ ఘటనకు స్పందించిన తుల ఉమ హైకమాండ్ తీరును తప్పుపడుతూ.. కన్నీరు పెట్టారు. మరోవైపు తుల ఉమ విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ఆమె మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తుల ఉమ పార్టీ మారడం సరైన నిర్ణయం అని ఆమె అనుచరులు మద్దతిస్తున్నారు.

ఇదే సమయంలో బీఆర్​ఎస్​ శ్రేణులు తుల ఉమతో చర్చలు జరపడంతో చివరికి ఆమె బీఆర్​ఎస్​ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.. మరోవైపు తుల ఉమ ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​ కండువా కప్పుకొనున్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment