Telugu News » Leopard: టపాసుల శబ్ధానికి భయపడి.. 15గంటలు ఇంట్లోనే చిరుత..!

Leopard: టపాసుల శబ్ధానికి భయపడి.. 15గంటలు ఇంట్లోనే చిరుత..!

తమిళనాడులోని నీలగిరి జిల్లా (Nilgiri distric)లోని కూనూర్‌లోగల బ్రూక్‌ల్యాండ్స్ ప్రాంతం (Coonoor Brooklands area) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది.

by Mano
Leopard: Scared of the sound of tapas.. Leopard stayed at home for 15 hours..!

దీపావళి (Deepavali) పండుగ రోజున తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టపాసుల శబ్దానికి భయపడిన ఓ చిరుతపులి (Leopard) ఓ ఇంట్లోకి చొరబడి 15 గంటల పాటు అక్కడే ఉంది. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Leopard: Scared of the sound of tapas.. Leopard stayed at home for 15 hours..!

తమిళనాడులోని నీలగిరి జిల్లా (Nilgiri distric)లోని కూనూర్‌లోగల బ్రూక్‌ల్యాండ్స్ ప్రాంతం (Coonoor Brooklands area) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి ఆరుగురు వ్యక్తులపై దాడి చేసింది. టపాసులు కాల్చడంతో ఆ శబ్దానికి భయపడి ఓ ఇంట్లోకి చొరబడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

దీంతో స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని చిరుతపులిపై నిఘా ఉంచేందుకు మూడు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా చిరుత కదలికలను నిరంతరం గమనించారు. ఆదివారం రాత్రి సమయంలో అది ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

చిరుత ప్రమాదమని తెలిస్తే ఒకే చోట ఉంటుందని ముదుమలై టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ తెలిపారు. దీపావళి టపాసులు కాల్చడంతో పెద్ద శబ్ధాలకు భయపడి ఆ ఇంట్లోనే ఉండిపోయిందన్నారు. చిరుత బారి నుంచి కాపాడుకోవడానికి పెద్దగా అరిచినా లేదా ఏదనా పొడవాటి వస్తువులను పట్టుకున్నా అవి వాటికంటే పెద్ద జంతువుగా భావించి పారిపోతాయని చెప్పారు.

You may also like

Leave a Comment