Telugu News » America : అమెరికా అధ్యక్షుడి మనవరాలు పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం!!

America : అమెరికా అధ్యక్షుడి మనవరాలు పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం!!

నవోమి కారుపై దాడి జరిగినప్పుడు ఆమె తన సెక్యూరిటీతో జార్జ్‌టౌన్‌లో ఉన్నట్టు స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఇక దాడి చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తులు కారులో పారిపోయినట్లు సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది.

by Venu

తప్పు చేయాలన్న ఆలోచన వస్తే కంట్రోల్ చేయడం కొందరికి కష్టం అవుతుంది. అందులో సంపన్నుల విషయంలో అయితే ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. పేరుకే డబ్బుహోదా.. కానీ క్షణక్షణం బిక్కు బిక్కుమంటూ బ్రతకడం తప్పని సరి.. ఏక్షణం ఏమరుపాటుగా ఉన్న ప్రమాదమే.. నమ్మినవారే ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టవచ్చు.. ప్రస్తుతం ఇలాంటి ఘటనే జరిగింది.

అమెరికా (America) అధ్యక్షుడు (President) జో బైడెన్ (Jo Biden) మనవరాలు నవోమీ బిడెన్ (Naomi Biden) భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. నవోమిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు ఆగంతకులు ఆమె ప్రయాణిస్తున్న కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. కాగా నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. నవోమి కారుపై దాడి చేయడాన్నిచూసి వెంటనే కాల్పులు జరిపారు.

మరోవైపు నవోమి కారుపై దాడి జరిగినప్పుడు ఆమె తన సెక్యూరిటీతో జార్జ్‌టౌన్‌లో ఉన్నట్టు స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఇక దాడి చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తులు కారులో పారిపోయినట్లు సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది. పారిపోయిన దుండగుల కోసం సెర్చింగ్ ప్రారంభించినట్లు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ అంశం పై బహిరంగంగా వివరాలు వెల్లడించలేమని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అధికారి తెలిపినట్టు సమాచారం.

You may also like

Leave a Comment