Telugu News » 6 wickets in 6 balls: క్రికెట్ చరిత్రలో మరో రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు..!

6 wickets in 6 balls: క్రికెట్ చరిత్రలో మరో రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు..!

తాజాగా ఈ ఫీట్ ఆస్ట్రేలియా క్లబ్‌లో నమోదైంది. క్రికెటర్ గారెత్ మోర్గాన్(Gareth Morgan) 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్-3 టోర్నీలో నెరాంగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్నాడు.

by Mano
6 wickets in 6 balls: Another record in cricket history.. 6 wickets in 6 balls..!

క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఎవరు రికార్డులు సృష్టిస్తారో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి బాగా ఆడుతుందని అనుకున్న జట్టు ఓడిపోతుంది. కొన్నిసార్లు ఓటమికి అడుగు దూరంలో అనూహ్యంగా విజయతీరానికి చేర్చుతుంది. అలాంటి అద్భుతమే ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్‌ క్రికెట్‌లో చోటుచేసుకుంది. ఒకే ఓవర్‌లో అంటే 6 బంతుల్లో 6 వికెట్లు(6 Wickets in 6 balls) పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

6 wickets in 6 balls: Another record in cricket history.. 6 wickets in 6 balls..!

ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు నమోదయినా.. 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టిన దాఖలాలు లేవు. తాజాగా ఈ ఫీట్ ఆస్ట్రేలియా క్లబ్‌లో నమోదైంది. క్రికెటర్ గారెత్ మోర్గాన్(Gareth Morgan) 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్-3 టోర్నీలో నెరాంగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. సర్ఫర్స్ పారడైజ్ సీసీపై అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు.

40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్స్ కోల్పోయి 174 రన్స్ చేసింది. 6 బంతుల్లో 5 పరుగులు చేస్తే సర్ఫర్స్ గెలుస్తుంది. ఈ తరుణంలో ముద్దీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ అద్భుతం సృష్టించాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా.. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో సర్ఫర్స్ జట్టు ఆలౌట్ అయింది. ముద్దీరాబా నెరంగ్ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.

ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదివరకు ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భాలు చాలా అరుదు. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్ హరియాణాపై 5 వికెట్లు తీశాడు. 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ-బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు. 2011లో వెల్లింగ్టన్‌పై న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్ 5 వికెట్లు తీశాడు.

తాజా మ్యాచ్‌లో గరాత్ ఏడు ఓవర్లు వేసి 7/16 స్కోర్‌ను నమోదు చేశాడు. గారెత్ మోర్గాన్ వేసిన 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్ ఔట్స్ కాగా.. మిగతా రెండు బౌల్డ్ ఔట్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గారెత్ 7 ఓవర్లు వేసి 7 వికెట్స్ పడగొట్టి 16 రన్స్ ఇచ్చాడు. గారెత్ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

You may also like

Leave a Comment