Telugu News » Tirupati : నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్.. హెచ్చరిస్తున్న పోలీసులు..!!

Tirupati : నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్.. హెచ్చరిస్తున్న పోలీసులు..!!

నడుముకు రాళ్లు, ఆయుధాలు ధరించిన ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యుల బృందం జిల్లాలో హల్ చల్ చేస్తుండటం కలకలం రేపుతుంది. అయితే ఈ గ్యాంగ్ గతంలో విజయవాడలో చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

by Venu

కొందరు నేరాలు చేయడంలో ఆరితేరి ఉంటారు.. వీరికి జాలి, దయ అంటే ఏంటో కూడా తెలియదు. మనుషుల రక్తం రుచి మరిగిన రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. పేరుకే మనుషులు కానీ నరరూప రాక్షసులు.. ఇలాంటి పేరు తెచ్చుకున్న వారే చెడ్డీ గ్యాంగ్.. ఈ గ్యాంగ్ కన్నుపడింది అంటే.. ఇక అంతే.. రాష్ట్రాలను గడగడలాడిస్తున్న ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో సంచరిస్తున్నట్టు సమాచారం..

పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ (Chaddi-Gang).. తిరుపతి (Tirupati)లో నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోరీలకు విఫలయత్నాలు చేసింది. తిరుపతి, రేణిగుంట (Renigunta)మార్గంలో ఉన్న మారుతీ సుజుకి షోరూమ్‌లో చోరీకి ప్రయత్నించారు. రాడ్లు, ఆయుధాలు చేతపట్టుకుని షోరూమ్‌ అంతటా గాలించారు. మరోవైపు కృష్ణతేజ కాలేజి, చెర్లోపల్లి వద్ద ఒక డాక్టర్ నివాసంలో కూడా చోరీకి యత్నించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మరోవైపు నడుముకు రాళ్లు, ఆయుధాలు ధరించిన ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ సభ్యుల బృందం జిల్లాలో హల్ చల్ చేస్తుండటం కలకలం రేపుతుంది. అయితే ఈ గ్యాంగ్ గతంలో విజయవాడలో చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారి పోటోలు, వీడియో విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు (police) హెచ్చరిస్తున్నారు. తిరుపతి నగర శివార్లలో పోలీసు పెట్రోలింగ్‌ పెంచడమే కాకుండా.. సరిహద్దు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేసినట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment