Telugu News » Madhya Pradesh: వింత ఆచారం.. ఆవులతో తొక్కించుకున్న భక్తులు..!

Madhya Pradesh: వింత ఆచారం.. ఆవులతో తొక్కించుకున్న భక్తులు..!

by Mano
Madhya Pradesh: Strange custom.. Devotees trampled with cows..!

ఇప్పటికే చాలా వరకు విచిత్రమైన సంప్రదాయాలు, వింత ఆచారాలను మనం వినే ఉంటాం. బొగ్గులపై నడవడం, జంతువులతో పెళ్లి చేయడం, చెప్పులు వేసుకోకుండా తిరగడం వంటి అనేక వింత ఆచారాలను చూసే ఉంటాం. దేవుడిపై ఉన్న నమ్మకంతో ఆ పని చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. మరికొందరు తమ వారసత్వంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని చెబుతుంటారు.

Madhya Pradesh: Strange custom.. Devotees trampled with cows..!

అలాంటి వింత ఆచారమే మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఉజ్జయినిలో కొనసాగుతోంది. అక్కడ భక్తులు నేలపై పడుకొని ఆవులతో తొక్కించుకుంటున్నారు. ఆవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు అంటున్నారు. తల్లి ఆవు ఎవరికీ హాని చేయదని వారు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు.

తాజాగా భక్తులపై నుంచి ఆవులు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉజ్జయిని జిల్లాలోని భిదద్వాడ్ గ్రామంలో దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ చేయడం వారి సంప్రదాయం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది వందలాది మంది పురుషులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈ పూజలో పాల్గొనే భక్తులు ముందుగా ఐదు రోజుల పాటు ఉపవాసం ఉంటారు.

ఆలయంలో ఐదురోజుల పాటు భజన కీర్తనలు చేసి చివరి రోజున నేలపై పడుకుని ఆవులతో తొక్కించుకుంటారు. దీపావళి పండగ తర్వాతి రోజు ఉదయం గ్రామస్థులు గోవులకు పూజలు చేస్తారు. ఆ తర్వాత అన్నింటినీ ఒకే చోటకు తీసుకొస్తారు. వాయిద్యాలు, డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకుంటారు. అయితే, అబద్దం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని అక్కడి వారు నమ్ముతున్నారు.

You may also like

Leave a Comment