Telugu News » Jawahernagar: సీఎం, మంత్రి తోడు దొంగల్లా భూకబ్జాలు చేశారు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Jawahernagar: సీఎం, మంత్రి తోడు దొంగల్లా భూకబ్జాలు చేశారు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

సీఎం కేసీఆర్(Cm kcr), మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) మేడ్చల్‌ జిల్లాలో తోడు దొంగల్లా భూకబ్జాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ జవహార్ నగర్ ప్రజలకు ఇచ్చిందేమీ లేదని.. ఒక్క డంపింగ్ యార్డు తప్పా.. అంటూ ఎద్దేవా చేశారు.

by Mano
Jawahernagar: The CM and the Minister have grabbed land like thieves.. Revanth Reddy's key comments..!

సీఎం కేసీఆర్(Cm kcr), మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) మేడ్చల్‌ జిల్లాలో తోడు దొంగల్లా భూకబ్జాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహార్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ ‌మీటింగ్‌లో రేవంత్ ‌మాట్లాడారు.

Jawahernagar: The CM and the Minister have grabbed land like thieves.. Revanth Reddy's key comments..!

సీఎం కేసీఆర్ జవహార్ నగర్ ప్రజలకు ఇచ్చిందేమీ లేదని.. ఒక్క డంపింగ్ యార్డు తప్పా.. అంటూ ఎద్దేవా చేశారు. డంపింగ్ యార్డు తరలింపునకు కోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కరెంట్, రైతు బంధుపై- కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.

రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి.. వారికి నిలువ నీడ లేకుండా చేశాడని దుయ్యబట్టారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.

చెరువుల పక్కన భూములు కొని చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని ఆరోపించారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని దుయ్యబటారు. మరీ కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని.. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలని ప్రజలను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని రేవంత్ ప్రశ్నించారు. ముదిరాజ్‌లకు ఒక్కసీటూ ఇవ్వలేదన్నారు. రాష్ట్రం కేసీఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను అమలుచేసి తీరుతామన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం – 2050 విజన్‌తో ముందుకెళ్తామని చెప్పారు.

You may also like

Leave a Comment