బీఆర్ఎస్ (BRS)పై బీజేపీ (BJP) రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ధరణి (Dharani)లో చాలా లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అసలు ధరణి పోర్టల్ అతి పెద్ద స్కామ్ అని మండిపడ్డారు.
బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్‌తో కలిసి ప్రకాష్ జవదేకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ధరణి నిర్వహణ బాధ్యతను తొలుత టీసీఎస్ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ ఆ తర్వాత ఆ బాధ్యతను ఐఎల్ఎఫ్ఎస్కు అప్పగించారని అన్నారు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను ప్రైవేట్ సంస్థ టెర్రాస్ సీఐఎస్ చేతిలోకి చేరిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణలో తలెత్తిన లోపాలపై ఎలాంటి ఫిర్యాదులు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ధరణి బాధితుల నుంచి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు.
బాధితులుbjp@gmail.com,dharanicomplaints.bjp@gmail.com లేదా 9391936262, 7330861919నంబర్లకు వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. బీజేపీ సర్కార్ వచ్చాక వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు.