Telugu News » Maoist Party : ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్న అవకాశవాది బీఆర్ఎస్‌..!?

Maoist Party : ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్న అవకాశవాది బీఆర్ఎస్‌..!?

అధికార మదంతో, అహంకారంతో ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ పదేళ్ళుగా తెలంగాణ ప్రజలను దగా చేసిందని.. అవినీతి పై ఇంకా దాహం తీరనట్టు.. మూడోసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధమవుతుందని మావోయిస్టు పార్టీ (Maoist Party) మండిపడుతుంది..

by Venu

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) గెలుపుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న సంకేతాలు ప్రళయాన్ని సృష్టించడానికి సిద్దం అవుతున్నాయని కొందరు అంటున్నారు. ఈ గజిబిజి గందరగోళంలో దొరల పాలనపై మావోయిస్టు పార్టీ ఫైర్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్న మావోయిస్టు పార్టీ.. రాష్ట్రం నుంచి ఆ పార్టీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చింది.

అధికార మదంతో, అహంకారంతో ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ పదేళ్ళుగా తెలంగాణ ప్రజలను దగా చేసిందని.. అవినీతి పై ఇంకా దాహం తీరనట్టు.. మూడోసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధమవుతుందని మావోయిస్టు పార్టీ (Maoist Party) మండిపడుతుంది.. రాష్ట్రంలో దొరల కుటుంబ పాలన సాగిస్తూ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కొద్దిమంది దోపిడీదారులకు మాత్రమే అనుభవించే హక్కును ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలంతా ఏకం అవ్వాలని మావోయిస్టు పార్టీ కోరుతుంది. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అనివార్యత ఏర్పడిందని వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర  కార్యదర్శి జగన్ (Jagan) ఇచ్చిన ఇంటర్‌వ్యూను విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పడితే నియామకాలు దక్కుతాయని భావించి ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని, కానీ రెగ్యులర్ ఉద్యోగాల్లేక ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగులు నిత్యం పోరాడక తప్పని పరిస్థితులను ఈ ప్రభుత్వం కల్పించిందని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలను అనేకసార్లు రద్దు చేయించడం ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించింది.

ఎన్నికలు రాగానే రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గిరిజనబంధు అంటూ ప్రజలను బీఆర్ఎస్ మాయచేస్తున్నదని, దళితులకు మూడెకరాల భూమి వాగ్ధానాన్ని గద్దెనెక్కిన తర్వాత మరచిందని మావోయిస్టు పార్టీ తెలిపింది. ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. కేసీఆర్ (KCR) ఫ్యామిలీ కాళేశ్వరం ద్వారా కోట్లాది రూపాయలు పోగేసుకున్నదని ఆరోపించింది.

రాష్ట్రాన్ని మాత్రం అప్పుల్లోకి నెట్టి ఇప్పుడు ఆ అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికి ప్రభుత్వ భూముల్ని అమ్ముకోవాల్సిన దుస్థితి పట్టిందని మావోయిస్టు పార్టీ ఆగ్రహించింది. బీజేపీతో (BJP) బీఆర్ఎస్‌కు అంతర్గత ఐక్యత ఉందని ఆరోపించిన మావోయిస్టు పార్టీ.. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్న అవకాశవాద బీఆర్ఎస్‌ను తన్ని తరిమేయాలని రాష్ట్ర కార్యదర్శి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

You may also like

Leave a Comment