Telugu News » Vijayawada Car Racing: బెజవాడలో కార్ రేసింగ్ కలకలం.. ఇద్దరి పరిస్థితి విషమం..!

Vijayawada Car Racing: బెజవాడలో కార్ రేసింగ్ కలకలం.. ఇద్దరి పరిస్థితి విషమం..!

విజయవాడ(Vijayawada) నగరంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్‌(Car Racing) ప్రమాదానికి దారితీసింది. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

by Mano
Vijayawada Car Racing: Car racing chaos in Bejwada.. Both are in serious condition..!

బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళల్లో కార్ రేసింగ్‌లు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ ఉండడం విశేషం. తాజాగా విజయవాడ(Vijayawada) నగరంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కార్ల రేసింగ్‌(Car Racing) ప్రమాదానికి దారితీసింది.

Vijayawada Car Racing: Car racing chaos in Bejwada.. Both are in serious condition..!

ఈ ఘటన ఎగ్జిక్యూటివ్ క్లబ్ జంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐఈపీఎల్ ఐనాక్స్(IEPL Inox) ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న రెండు స్కూటీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

వారికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వేంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు ముక్కలుముక్కలుగా అయిపోయాయి. ఫార్చూనర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ప్రమాదానికి కారకులైన ఫార్చూనర్ కారులోని యువతి, యువకుడు.. మరో కారులో పరారయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఈ గ్రూప్‌లో ఉన్నారని పోలీసులు విచారణ చేపట్టారు. కొంత కాలంగా బెజవాడలో కార్ల రేసింగ్ తరచుగా జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment