Telugu News » Sireesha : రాజకీయాల్లో బర్రెలక్క.. ప్రచారానికి ప్రభుత్వ ప్రతినిధి సాయం..!!

Sireesha : రాజకీయాల్లో బర్రెలక్క.. ప్రచారానికి ప్రభుత్వ ప్రతినిధి సాయం..!!

ఎన్నికల బరిలో ఉన్న బర్రెలక్కకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు రూ. లక్ష విరాళం ఇచ్చి.. ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ ఫోన్ లో అభినందనలు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఆలోచన ఉంటే తాను సాయం చేస్తానని బర్రెలక్కకు కృష్ణారావు చెప్పినట్టు సమాచారం..

by Venu

అవినీతి పై యువత పిడికిలి బిగించకుంటే.. భవిష్యత్తు అంధకారంగా మారుతుందని మేధావులు తెలిపారు. ఈ మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాజకీయాల్లోకి వద్దామని ఆలోచిస్తున్న వారు ఖర్చుకు భయపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ నిజాయితీగా ఒక్క అడుగు వేస్తే.. జనం మనవెంటే ఉంటారని నిరూపించారు బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీష (Sireesha)..

ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అందుకే బర్రెలు కాసుకుంటున్నానని.. నిరుద్యోగుల సమస్యలపై తన స్టైల్‌ లో నిరసన తెలిపి.. పాపులర్‌ అయిన (Barrelakka) బర్రెలక్క.. అలియాస్ శిరీష.. కొల్లాపూర్ (Kolhapur) స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా (Independent MLA) బరిలో ఉన్నారు. మరోవైపు నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలోకి దిగిన శిరీష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

అయితే… ఎన్నికల బరిలో ఉన్న బర్రెలక్కకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు రూ. లక్ష విరాళం ఇచ్చి.. ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ ఫోన్ లో అభినందనలు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఆలోచన ఉంటే తాను సాయం చేస్తానని బర్రెలక్కకు కృష్ణారావు చెప్పినట్టు సమాచారం.. మరోవైపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన శిరీష.. ఉద్యోగం లేకపోవడంతో తన ఊరిలో బర్రెలు కాసుకుంటూ జీవితాన్ని నిరాశతో గడిపేది..

ఒకగానొక సమయంలో తనలో ఉన్న ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి శిరీష ను బర్రెలక్కగా పిలవడం ప్రారంభించారు. అలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుని.. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచింది. కాగా బర్రెలక్కకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి.

You may also like

Leave a Comment