హీరోయిన్ త్రిష(Heroin Trisha)ను ఉద్దేశిస్తూ ఇటీవల ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీఖాన్(Mansoor Ali khan) చేసిన అసభ్యకరమైన వాఖ్యలకు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్, సింగర్ చిన్మయి, హీరోయిన్ మాళవిక మోహన్, పలువురు నిర్మాతలు అతడి వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచారు.
తాజాగా అలీఖాన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా X(ట్విట్టర్) వేదికగా స్పందించారు. అలీఖాన్ వ్యాఖ్యలు అతడి నీచపు సంస్కృతికి నిదర్శనం అని మంత్రి రోజా మండిపడ్డారు. మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన్సూర్ ఆలీ ఖాన్ లాంటి మగాళ్లు మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదని అన్నారు.
ఆడవాళ్ళ గురించి మగాళ్లు అసభ్యకరంగా మాట్లాడినప్పుడల్లా వారిపై కఠినంగా, చట్టపరమైన పోలీస్ చర్యలు తీసుకోవాలని రోజా అభిప్రాయపడ్డారు. ‘వాళ్లు నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు.. లేదంటే త్రిష, కుష్బూలపై వ్యాఖ్యలు చేసిన వారు కావచ్చు.’అని రోజా పేర్కొన్నారు.
‘కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో ఈ మగాళ్లు ఇలాగే అస్సలు భయపడకుండా ఏదైనా మాట్లాడుతారు. మమ్మల్ని ఇలా టార్గెట్ చేసినా సినిమాల్లో ఎదిగి చూపించాం. ఇలాంటి మగాళ్ళను ఇతర మహిళలు కలిస్తే వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించండి..’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
Whenever men speak against women, strong legal and police action should take place. Whether it’s @JaiTDP MLA who attacked me. Or Mansoor Ali Khan who again has spoken about @trishtrashers, @khushsundar and Me. Unless strong legal actions take place, these men will never fear…
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 19, 2023