Telugu News » Daggubati Purandeshwari: తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: పురంధేశ్వరి

Daggubati Purandeshwari: తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: పురంధేశ్వరి

ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి స్పష్టత ఉందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే (PM Modi) దక్కుతుందని తెలిపారు.

by Mano
Daggubati Purandeshwari: Tata is not afraid of slaps: Purandeshwari

వ్యక్తిగత దూషణలకు దిగుతున్న వైసీపీ తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి స్పష్టత ఉందని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే (PM Modi) దక్కుతుందని తెలిపారు.

Daggubati Purandeshwari: Tata is not afraid of slaps: Purandeshwari

సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదని పురంధేశ్వరి తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తోందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అవినీతిరహిత పాలనను మోడీ అందించారని తెలిపారు.

రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కరువు విలయ తాండవం చేస్తోందని అన్నారు. మోడీ అన్ని కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారని టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment