Telugu News » EX IAS Murali: కాళేశ్వరం, భగీరథ పేరిట వేల కోట్ల కుంభకోణం: మాజీ ఐఏఎస్

EX IAS Murali: కాళేశ్వరం, భగీరథ పేరిట వేల కోట్ల కుంభకోణం: మాజీ ఐఏఎస్

విశ్రాంత ఐఎఎస్(EX IAS) ఆకునూరి మురళి(Akunuri Murali) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 20 వరోజు సోమవారం నాగర్ కర్నూల్, బిజినెపల్లిలలో కొనసాగింది.

by Mano
EX IAS Murali: Kaleswaram, Bhagirath scam in the name of thousands of crores: Ex-IAS

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వేలకోట్ల కుంభకోణాలతో కేసీఆర్ కుటుంబం తన్నుకుపోయిందని జాగో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, విశ్రాంత ఐఎఎస్(EX IAS) ఆకునూరి మురళి(Akunuri Murali) ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర 20 వరోజు సోమవారం నాగర్ కర్నూల్, బిజినెపల్లిలలో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

EX IAS Murali: Kaleswaram, Bhagirath scam in the name of thousands of crores: Ex-IAS

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట అడ్డూ అదుపులేని అవినీతి జరిగిందని దాని ఫలితంగానే ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నాని మురళి ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా, వైద్య శాఖలను నిర్వీర్యం చేశారని నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కార్మికులకు కనీస వేతనాలు అందలేదన్నారు.

రైతుబంధు, రైతులు కానీ రైతులకు జేబులు నింపుతుందన్నారు. చిన్నస్థాయి రైతులు, రైతు కూలీల బతుకులు అధ్వానంగా మారాయని తెలిపారు. మోడీ విధానాలను తొమ్మిదళ్లుగా కేసీఆర్ సమర్థిస్తూ వచ్చారన్నారు. వీరికి మతతత్వ ఎంఐఎం పార్టీ మద్దతిస్తుందన్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నాయన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న నల్ల ధనం తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అనే భారీ ఎజెండాను ప్రకటించి మొండి చేయి చూపిందని మురళి ఆరోపించారు. కానీ బడా కార్పొరేట్ కంపెనీలకు రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిందన్నారు. ప్రజల మధ్య కులమత బేధాలు రెచ్చగొట్టే విధానాలు అమలు చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని ఆరోపణలు చేశారు.

You may also like

Leave a Comment