తెలంగాణ (Telangana) అన్ని రంగాలలో ముందుకు పోతుంది.. ఇది అధికార పార్టీ నేతలు చెప్పే మాటలు.. అవును నిజంగానే తెలంగాణ అన్నిట్లో ముందు ఉంది.. ముఖ్యంగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టివేతలో తెలంగాణ ఫస్ట్ అని సీఈసీ (EC) చేసిన ప్రకటన.. ఇప్పుడు చెప్పండి ఓటర్లు బంగారు తెలంగాణ చాలా డెవలప్ అయ్యిందని అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్.. ఎందుకంటే..
ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే విడతల వారిగా చత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పోలింగ్ పూర్తి అయ్యింది. తెలంగాణ, రాజస్థాన్లో త్వరలో పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు నిత్యం వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం అనేక ప్రాంతాల్లో రహస్యంగా తరలిస్తున్న నగదు, మద్యాన్ని పట్టుకుంది.
అయితే ఎన్నికలు జరుగుతున్నరాష్ట్రాల్లో ఎంత డబ్బు, మద్యం పట్టుబడిందనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. దేశంలో నగదు, మద్యం, డ్రగ్స్ పట్టివేతలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) ముందు వరుసలో ఉన్నట్లు ఆ ప్రకటనలో ఈసీ వెల్లడించింది.
ఇప్పటి వరకు తెలంగాణలో రూ.225.23కోట్ల నగదు.. రూ.86.82 కోట్లు విలువ చేసే లిక్కర్.. రూ. 103.74 కోట్లు విలువ చేసే డ్రగ్స్.. రూ. 191.02 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఓటర్లను మభ్య పెట్టేందుకు ఉపయోగించిన రూ.52.41 కోట్ల విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.. మిజోరాంలో లిక్కర్, డ్రగ్స్ మినహా.. నగదు, విలువైన వస్తువులేమీ పట్టుపడలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. చూశారా ఓటర్లు మిగతా రాష్ట్రాలకన్నా, మన తెలంగాణ ఫస్ట్ ఉందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనం..