Telugu News » Viral Photo: డ్రైనేజీలోకి దిగిన ప్రపంచ కుబేరుడు.. ఎందుకో తెలుసా..?

Viral Photo: డ్రైనేజీలోకి దిగిన ప్రపంచ కుబేరుడు.. ఎందుకో తెలుసా..?

నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే(World Toilet Day).

by Mano
Viral Photo: World's Kubera who landed in the drainage.. Do you know why..?

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) మ్యాన్ హోల్‌లో దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిల్‌గేట్స్ ఏంటి? మురుగు కాలువలో దిగడమేంటి? అని ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. కానీ ఇది అక్షరాలా నిజం. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే(World Toilet Day). ఈ సందర్భంగా ఓ పిక్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Viral Photo: World's Kubera who landed in the drainage.. Do you know why..?

బిల్‌గేట్స్ బ్రస్సెల్స్‌లోని సీవర్ మ్యూజియాన్ని సందర్శించే క్రమంలో ఆయన మ్యాన్‌హోల్‌లో దిగుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఆయన అండర్ గ్రౌండ్ మ్యూజియంలో పలువురు శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

‘బ్రసెల్‌లోని అండర్‌గ్రౌండ్ మ్యూజియంలో అన్ని విషయాలను నేను తెలుసుకున్నాను. మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన చరిత్రను డాక్యుమెంట్ చేస్తున్నాను. 1800లో నగరంలోని మురుగు నీరు అంతా సెన్నే నదిలో డంప్ చేసింది. దీంతో భయంకరమైన కలరా వ్యాప్తి చెందింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. 200-మైళ్ల డ్రైనేజ్ నెట్‌వర్క్, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తాయి’ అని వీడియోలో బిల్‌గేట్స్ తెలిపారు.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. 200-మైళ్ల మురుగు కాలువలు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నెట్‌వర్క్ అనేది నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది. ఈ సందర్భంగా బ్రస్సెల్స్‌లోని మురుగు నీటి వ్యవస్థతో పాటు మురుగు నీటి కారణంగా తలెత్తే సమస్యలను వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా తెలుసుకున్నానని బిల్‌గేట్స్ పోస్టు పెట్టారు.

You may also like

Leave a Comment