Telugu News » Telangana: పోలీస్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు?.. అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్..!

Telangana: పోలీస్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు?.. అర్ధరాత్రి టెన్షన్.. టెన్షన్..!

. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose) ఇంట్లో పెద్దఎత్తున నగదు ఉందని ఆరోపిస్తూ 150 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిపై ముట్టడికి ప్రయత్నించారు.

by Mano
Telangana: Bundles of notes in police officer's house?.. Midnight tension.. Tension..!

ఖమ్మం జిల్లా(Kammam Dist)లో అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్(Subhash Chandrabose) ఇంట్లో పెద్దఎత్తున నగదు ఉందని ఆరోపిస్తూ 150 మంది దాకా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిపై ముట్టడికి ప్రయత్నించారు.

Telangana: Bundles of notes in police officer's house?.. Midnight tension.. Tension..!

బీఆర్ఎస్ కార్యకర్తలూ అక్కడికి చేరుకున్నారు. వీరితోపాటు ఎన్నికల అధికారులు, పోలీసులూ ఒకసారిగా సుభాష్ ఇంటికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సుభాష్ దగ్గర భారీగా అక్రమ నగదు ఉందని, ఆ నగదు అధికార పార్టీదే అని కాంగ్రెస్ సి విజిల్‌కు కంప్లైంట్ ఇచ్చింది.

సుభాష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎలాంటి నగదు దొరకలేదు. కాంగ్రెస్ చేసింది ఆరోపణ మాత్రమేనని సి విజిల్ అధికారులు తేల్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిటైర్డ్ డీసీపీ అయిన సుభాష్ చంద్రబోస్ ఈ ఘటనపై మండిపడ్డారు. కాంగ్రెస్ వారే కావాలని ఇలా చేయించారని చెప్పుకొచ్చారు.

150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన ఇంటి మీద దాడికి వచ్చారని దీని వెనక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఆరోపించారు. మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ తన దగ్గర అక్రమంగా నగదును దాచిపెట్టి ఉన్నట్లయితే చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసిన తన ఇంటిపై దాడికి దిగడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment