Telugu News » Uttar Pradesh : కాలేజీలో హెలికాఫ్టర్ ల్యాండింగ్.. వైరల్ వీడియో..!!

Uttar Pradesh : కాలేజీలో హెలికాఫ్టర్ ల్యాండింగ్.. వైరల్ వీడియో..!!

హెలికాఫ్టర్​​ ల్యాండింగ్​ సమయంలో వచ్చే గాలికి గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన ఎల్​ఈడీ స్క్రీన్​లు, జెండాలు, టెంట్​లు, స్తంభాలు నేలకూలాయి. అదీగాక హెలికాఫ్టర్​​ ల్యాండింగ్ సమయంలో చుట్టూ వ్యాపించిన దుమ్ము కారణంగా విద్యార్థులు, సిబ్బంది, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

by Venu

ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) రాజధాని లక్నో పట్టణంలో ఉన్న ఓ కళాశాల మైదానం​లో సడెన్ గా హెలికాఫ్టర్​​ ల్యాండ్​ అయ్యి ఆశ్చర్యానికి గురిచేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విమానం మైదానంలో ల్యాండ్ అవడం వల్ల కాలేజీ విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ​

లక్నో పట్టణంలో ఉన్న లామార్టినియర్ కాలేజీ (Lamartineyar College)లో.. 139వ జూనియర్ స్కూల్ స్పోర్ట్స్​ డే ఈవెంట్​ను నిర్వహించారు. ప్రోగ్రాంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో.. కళాశాలకు చెందిన పోలో మైదానంలో ఉన్నట్టుండి VT-UPLఅనే పేరుగల హెలికాఫ్టర్​​ (Helicopter) ల్యాండ్​ అయింది. అలా ఊహించని విధంగా హెలికాఫ్టర్​​ ల్యాండ్ అవడంతో, కాలేజీలో ఉన్న విద్యార్థులు, సిబ్బంది గట్టిగా అరిచారు..

మరోవైపు హెలికాఫ్టర్​​ ల్యాండింగ్​ సమయంలో వచ్చే గాలికి గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన ఎల్​ఈడీ స్క్రీన్​లు, జెండాలు, టెంట్​లు, స్తంభాలు నేలకూలాయి.
అదీగాక హెలికాఫ్టర్​​ ల్యాండింగ్ సమయంలో చుట్టూ వ్యాపించిన దుమ్ము కారణంగా విద్యార్థులు, సిబ్బంది, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్,​ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.

ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా ల్యాండింగ్​ చేస్తారన్న కళాశాల ప్రిన్సిపల్.. పౌర విమానయాన శాఖతో పాటు డైరెక్టరేట్​ ఆఫ్​ ఎయిర్​ సేఫ్టీ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం హెలికాప్టర్​ ల్యాండింగ్​ అయిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

You may also like

Leave a Comment