మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణలతో నేపథ్యంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Minister Rajendranath Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. టీడీపీ హయాంలో రూ.40వేల కోట్ల పెండింగ్ బిల్లులకు గ్యారంటీ అడిగారా? అంటూ మండిపడ్డారు.
గ్యారంటీ లెటర్ అంటే ఏంటో తెలుసా? అసలు అంటూ నిలదీశారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని ఆరోపించారు. ఫ్రెషర్స్‌ను ఆర్థిక పరమైన అంశాల గురించి ముందు తెలుసుకోవాలని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బ్యాంక్ లు మెగా సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని తెలిపారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.
ఆరోగ్యశ్రీపై గత ప్రభుత్వం వెచ్చించింది రూ.5,177 కోట్లు, మా ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514 కోట్లు అని.. ఒక ఫ్రెషర్ చంద్రబాబు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని దుయ్యబట్టారు. బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 2019లో టీడీపీ హయాంలో రూ.4వేల కోట్ల పెండింగ్ బిల్లులకు గ్యారంటీ ఎందుకు అడగలేదని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.
టీడీపీ నేతలు దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజ దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. మెగా సంస్థకు ఎన్ని బకాయిలు ఉన్నాయి అని వివరాలు మాత్రమే బ్యాంకులకు ఇచ్చామన్న ఆయన.. నిర్మాణంలో ఉన్న పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.