Telugu News » Mlc Kavitha: ఐదేళ్లలో సొంతింటి కలను నిజం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha: ఐదేళ్లలో సొంతింటి కలను నిజం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు.

by Mano
Mlc Kavitha: Let's make the dream of owning a house come true in five years: Mlc Kavitha

వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు.

Mlc Kavitha: Let's make the dream of owning a house come true in five years: Mlc Kavitha

గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఎక్కడ కూడా మత ఘర్షణలు జరగలేదని కవిత తెలిపారు. రానున్న ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ ఐటీ హబ్‎లో 3200 ఉద్యోగాలు కల్పించాం. రానున్న ప్రభుత్వంలో విద్య, వైద్యం మరింత మెరుగు పరుస్తాం. కొత్త బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తాం అంటూ కవిత హామీ ఇచ్చారు.

కేసీఆర్ ఏది చెప్పినా అది చేసి చూపెడతారని కవిత తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక్కటే మైనారిటీ పాఠశాల ఉండేదని, ఇప్పుడు జిల్లాలో 23 మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేశామని కవిత తెలిపారు. మానవతా దృక్పథంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు.

తెలంగాణ రాక ముందు ఈ నగరంలో దయనీయ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించామని కవిత తెలిపారు. ఈ కాలనీని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ కొత్త మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయి.

You may also like

Leave a Comment