Telugu News » EC on KCR : కేసీఆర్ కు ఈసీ వార్నింగ్..!

EC on KCR : కేసీఆర్ కు ఈసీ వార్నింగ్..!

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇవి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాతే.. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడులు పెరిగాయని ఆరోపించారు.

by admin
cm kcr

– సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ
– రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దంటూ హెచ్చరిక
– బాధ్యతాయుత పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు తగదు
– బల్మూరి వెంకట్ ఫిర్యాదుపై స్పందన

పోలింగ్ దగ్గర పడుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా నాయకులందరూ జనంలో ఉంటూ ఓట్లు రాబట్టేందుకు శ్రమిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ (CM KCR) కు ఎన్నికల సంఘం (Election Commission) సీరియస్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

cm kcr

దుబ్బాక (Dubbaka) ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) గ్రామాల్లో పర్యటిస్తుండగా.. ఆయనపై దాడి జరిగింది. ఈ విషయం బాన్సువాడకు వెళ్లాక తెలుసుకున్న కేసీఆర్.. అక్కడ జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కాంగ్రెస్ (Congress) కుట్ర అంటూ తీవ్ర పదజాలంతో ఆ పార్టీ నేతలను దూషించారు.‘‘దాడులు చేయాలంటే తమకు మొండిదో లండుదో ఒక్క కత్తి దొరకదా.. మాకు తిక్క రేగితే దుమ్ము దుమ్ము అవుతుంది’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ (Balmuri Venkat) ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇవి విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల తర్వాతే.. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడులు పెరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంకట్ ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ.. కేసీఆర్‌ కు హెచ్చరిక లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. అలా చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు రూల్స్ కు విరుద్దమన్న ఈసీ.. అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని వెల్లడించింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదని తెలిపింది.

మరోవైపు, సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ హైకోర్టుకు కూడా వెళ్లారు వెంకట్. కేసీఆర్ చేసే ప్రసంగాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ..పిటిషన్ లో పేర్కొన్నారు. బాన్సువాడ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కోర్టు అయినా న్యాయం చేయాలని కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment