Telugu News » Nagar Kurnool : ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు..!!

Nagar Kurnool : ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు..!!

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్న నేతలు.. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వెళ్ళిన నిరసనలు ఎదురవుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని ఓట్లు అడగడానికి వెళ్తున్న వారికి ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు.

by Venu

చేసిన మంచిపని చిరకాలం నిలిచిపోతుందని పెద్దలు అంటారు. నలుగురికి మేలు కలిగేలా జీవిస్తే.. దండం పెడతారు.. మరి నేటి రాజకీయాల్లో ఇలాంటి దృశ్యాలు దుర్భిణి వేసి వెతికినా కనిపించడం లేదంటున్నారు. మరోవైపు నాయకుడు అనే వాడు ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి కానీ అవినీతి లిస్టులో ఉండకూడదని కొందరి యువత వాదన..

ఇక ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్న నేతలు.. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వెళ్ళిన నిరసనలు ఎదురవుతున్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ది చేశామని ఓట్లు అడగడానికి వెళ్తున్న వారికి ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన అభివృద్ది, సాధించిన ప్రగతి ఏంటని ఓటర్లు ప్రశ్నించడం నిత్యం వార్తల్లో హోరెత్తిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ (BRS) నేతకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది..

నాగర్​కర్నూల్​ (Nagar Kurnool) జిల్లా ఆమనగల్లు (Amanagallu) మండలం శంకర్ కొండ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ (Jaipal Yadav) ప్రచారాన్ని తండావాసులు అడ్డుకున్నారు. మేడిగడ్డ, శంకర్ కొండ తండాల మధ్య మెయిన్​ రోడ్డుపై ఉన్న కత్వవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మా గ్రామానికి ఎందుకు ప్రచారానికి వచ్చావని కాన్వాయ్ ముందు నిరసన తెలుపుతూ.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని గ్రామస్తులు ఆవేదన చెందారు.. 2021లో బ్రిడ్జి నిర్మాణానికి పీఎంజీఎస్ వై పథకం కింద రూ.3.10 కోట్లు మంజూరు కాగా, ఏడాది క్రితం భూమిపూజ చేసిన ఎమ్మెల్యే.. ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల జోక్యం చేసుకోగా ఎమ్మెల్యే ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మళ్లీ తండావాసులు అడ్డుకోవడంతో ప్రచారాన్నిమధ్యలో ఆపేసి జైపాల్ యాదవ్ వెళ్లిపోయారు.

You may also like

Leave a Comment