Telugu News » kamareddy : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తాం.. కేటీఆర్..!!

kamareddy : బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తాం.. కేటీఆర్..!!

మంత్రి కేటీఆర్‌ బిక్కనూరు (Bhiknoor)లో ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ భూ కబ్జాలు చేసేందుకు వస్తున్నారని వచ్చిన వ్యాఖ్యాలను తిప్పికొట్టిన ఆయన.. ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికిపోదని హామీ ఇచ్చారు.

by Venu
ktr fire on congress in munugodu

తెలంగాణ (Telangana)లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మునుపటి ఎన్నికల్లా కాదు.. ఈసారి వేరే లెవల్ ఎన్నికల్లా జరుగుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో బలమైన పోటీ లేకుండా సాగినా.. ఈ సారి మాత్రం చావో రేవో అన్నట్టుగా పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలలో చర్చనడుస్తుంది. అందులో సీఎం సీటుకు కూడా పోటీ గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఇక కేసీఆర్ (KCR) గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

minister ktr speech on telangana development

ఇప్పటికే కేటీఆర్ (KTR) ఎన్నికల ప్రచారంలో బాణంలా దూసుకెళ్తున్నాడని అంతా అనుకుంటున్నారు.. పోలింగ్ కు సమయం కూడా ఎక్కువగా లేదు.. కాబట్టి నేతల నోటి నుంచి విమర్శలు కూడా వేగంగా బయటకు వస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ బరిలో ఉన్న కామారెడ్డిలో కేటీఆర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి కేటీఆర్‌ బిక్కనూరు (Bhiknoor)లో ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ భూ కబ్జాలు చేసేందుకు వస్తున్నారని వచ్చిన వ్యాఖ్యాలను తిప్పికొట్టిన ఆయన.. ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికిపోదని హామీ ఇచ్చారు. కాగా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్నారంటే.. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టినట్టే అని కేటీఆర్‌ అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని కేటీఆర్ వెల్లడించారు. కామారెడ్డిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్.. మీరు కూడా కచ్చితంగా బీఆర్​ఎస్​కు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. కామారెడ్డి బాగుపడాలంటే, పొలాలకు నీళ్లు కావాలంటే సీఎం కేసీఆర్​తోనే సాధ్యమని వెల్లడించారు.. మరోవైపు తెలంగాణ ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లోనూ కేసీఆర్ కామారెడ్డి (kamareddy)లో విజయం సాధిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

You may also like

Leave a Comment