Telugu News » Earthquake: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..!

Earthquake: భారత్‌లోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..!

అస్సాంలోని దర్రాంగ్‌లో భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 7.36 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది.

by Mano
Earthquake: A series of earthquakes in two states..!

భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఇవాళ(నవంబర్ 26) తెల్లవారుజామున భూమి కంపించింది. హర్యానా(Haryana), అస్సాం(Assam) రాష్ట్రాల్లో ఉదయం 4గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించడం(Earthquake)తో ఆయా రాష్ట్రాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Earthquake: Earthquakes in many states of India.. People ran in fear..!

అస్సాంలోని దర్రాంగ్‌లో భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 7.36 గంటలకు 3.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది. 22 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది.

అదేవిధంగా హర్యానాలోని సోనిపట్‌లో స్వల్పంగా కంపించగా రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలను గుర్తించినట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

కాగా, అక్టోబర్‌ 3న నేపాల్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఫరీదాబాద్‌లో 3.1 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా. దీంతో ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భారత్‌లో వరుస భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

You may also like

Leave a Comment