Telugu News » Telangana Elections : రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే..ఓటరన్న ఒక్కసారి ఆలోచించు..!!

Telangana Elections : రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే..ఓటరన్న ఒక్కసారి ఆలోచించు..!!

ప్రలోభాలకు లొంగి ఐదు సంవత్సరాల అభివృద్దిని నేతల చేతిలో పెట్టడానికి ఓటర్లు సిద్దంగా ఉన్నారా? అనే చర్చ మొదలైంది. ఒకరకంగా నేతలు ఇచ్చే తాయిలాలు తీసుకునే ఓటర్లు కాస్త ఆలోచించవలసిన సమయం ఇదే..

by Venu

తెలంగాణ (Telangana)లో ఎన్నికల సమరం ముగింపు దశకు చేరువలో ఉంది. రేపటితో ప్రచారం పరిసమాప్తం అవనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ప్రజల్లోకి ఏమాత్రం చొచ్చుకుపోయాయనే అంశం పై ఆయా పార్టీల ముఖ్యనేతలు సమీక్ష చేస్తున్నారు. మరోవైపు మేధావి వర్గం..ఇన్నాళ్ళూ అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేసింది. గతంలో కాంగ్రెస్ (Congress)చేసిన అభివృద్ది ఏంటీ? ఒక వేళ బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే పాలన ఎలా ఉంటుందనే విషయంలో ఓటర్లు ఆలోచించవలసిన అవసరం ఉందని అంటున్నారు.

మరోవైపు ప్రలోభాలకు లొంగి ఐదు సంవత్సరాల అభివృద్దిని నేతల చేతిలో పెట్టడానికి ఓటర్లు సిద్దంగా ఉన్నారా? అనే చర్చ మొదలైంది. ఒకరకంగా నేతలు ఇచ్చే తాయిలాలు తీసుకునే ఓటర్లు కాస్త ఆలోచించవలసిన సమయం ఇదే.. ఆ నాయకుడు మనకు ఏం చేశాడు అని ఆలోచించే బదులు మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడు అని ఆలోచిస్తే ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని సామాజిక వేత్తలు, విశ్లేషకులు ఇప్పటికే హోరెత్తిస్తున్నారు.

ఈసారి తెలంగాణలో అధికారం చేపట్టే పార్టీకి కత్తిమీద సామూలా ఉంటుందనే అభిప్రాయం వెళ్లాడవుతుంది. ఒకవైపు మిగులులో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పగా మారడం ఆందోళన చెందవలసిన అంశంగా సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. అభివృద్ది పేరిట అప్పులు చేస్తుంటే.. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏ కలుగులోకి వెళ్తుంది. నేతలు కోట్లకు ఎలా పడగెత్తుతున్నారు. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలు అధిక ధరలతో పీడించబడుతుండగా.. నిరుద్యోగ సమస్యలు.. పరీక్షల లీకేజీలు.. రైతుల కష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలకు పేజీల సమస్యలు ఎందుకు పెండింగ్ లో ఉన్నట్టు? అనే ప్రశ్న మేధావుల నోటి నుంచి వినిపిస్తుంది..

ఎన్నికల్లో గెలవాలనే ఆరాటంతో వేల కోట్లు ఖర్చుపెట్టే బదులు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి జనానికి మేలు కలిగే విధంగా పాలన చేస్తే ఎన్నికలు ఇంత భారంగా ఉండవు కదా! అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నోటు తీసుకునే ఓటర్లు.. తాయిలాలు ఇచ్చే నేతలు ఆలోచించవలసిన సమయం ఐదు సంవత్సరాలలో ఒక ఎన్నికలప్పుడు మాత్రమే.. ఈ గట్టు దాటారా నేతలు ఇక ఐదు సంవత్సరాల వరకు ముఖం కూడా చూపించరని తెలిసిందే.. అందుకే రూపాయికి ఆశపడి ఓటు అమ్ముకుంటారా? లేక భావి తరాల భవిష్యత్తు కోసం నిజాయితీగా ఓటు వేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఎన్నికల రిజల్ట్ ద్వారా తెలుస్తుందని అంటున్నారు.

You may also like

Leave a Comment