Telugu News » Suryapet : కీలక మలుపు తిరగనున్న సూర్యాపేట రాజకీయం.. బాండ్ పేపర్ రాసిన ఎమ్మెల్యే అభ్యర్థి..!!

Suryapet : కీలక మలుపు తిరగనున్న సూర్యాపేట రాజకీయం.. బాండ్ పేపర్ రాసిన ఎమ్మెల్యే అభ్యర్థి..!!

ఈయన నియోజకవర్గ ప్రజలకు ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్‌పై రాసిచ్చిన హామీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా ఈనెల 26న సంకినేని రాసిచ్చిన హామీ ఓటర్లను ఆలోచింప చేస్తోందని అనుకుంటున్నారు.

by Venu

ఎన్నికల్లో గెలిచి డబ్బు ఎలా దోచుకోవాలో అని ఆలోచిస్తున్న వారికి భిన్నంగా ప్రవర్తిస్తున్న నేత తీరు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇదంతా సాధ్యమా? అని ఆలోచిస్తే.. మరోవైపు ఓటును అమ్ముకునే వారికంటే.. ఓటును నమ్ముకున్న ఈ నేత మాటలు నిజమైన ఓటు విలువను తెలియచేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ఎవరా నేత అంటే.. అతనే సూర్యాపేట (Suryapet) నియోజకవర్గ (Constituency) బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు (Sankineni Venkateswara Rao)..

ఈయన నియోజకవర్గ ప్రజలకు ప్రమాణ పూర్వకంగా బాండ్ పేపర్‌పై రాసిచ్చిన హామీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా ఈనెల 26న సంకినేని రాసిచ్చిన హామీ ఓటర్లను ఆలోచింప చేస్తోందని అనుకుంటున్నారు. ఈ హామీ గురించి విన్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, స్థానిక ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు సంకినేని రాసిన బాండ్ పేపర్‌లో ఏముందంటే.. సూర్యాపేటలో నన్ను గెలిపిస్తే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉంటారని, అది తుంగతుర్తి ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు వెంకటేశ్వర రావు.. రౌడీ రాజకీయం కాంగ్రెస్ (Congress) హయాంలో చేస్తే.. బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో భూ కబ్జాలు, అక్రమాలు జరిగాయని ఈ బాండులో పేర్కొన్నారు. ఇక బాండు పేపర్‌లో ఉన్న అంశాలను పరిశీలిస్తే..

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు,సమస్త ప్రజానీకానికి నమస్కారిస్తూ…..

1). 1999-2004 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశాను.

2). గత 15 సంవత్సరాలుగా సూర్యాపేట అసెంబ్లీ పరిధిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేతల హత్యా రాజకీయాలు, రౌడీయిజం, దళారీ వ్యవస్థను నిరోధిస్తాను.

3). అవినీతి, అక్రమాలతో, అధికార దుర్వినియోగంతో దారి మళ్లించిన వందల కోట్ల రూపాయల కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను గుర్తించి, రికవరీకి చర్యలు తీసుకుంటాను.

4). భూకబ్జాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణ, అక్రమార్జనపరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.

5). చిన్న,పెద్ద వ్యాపారులను భయపెట్టి, బెదిరించి సంపాదించిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపిస్తాను.

6). ఎటువంటి తారతమ్యం లేకుండా వ్యాపారులందరికీ స్వేచ్ఛా వాణిజ్యానికి హామీ ఇస్తున్నాను.

7). ప్రస్తుతం నేను మాజీ ఎమ్మెల్యే అయినా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఇతోధికంగా కృషి చేస్తున్నాను.

8). సూర్యాపేట అసెంబ్లీ పరిధిలో మునిసిపాలిటీ, పోలీసు అధికారుల వేధింపులు, తప్పుడు కేసుల నుంచి రక్షణ కల్పిస్తాను.

అందుకు నవంబరు 30న సూర్యాపేట నియోజకవర్గంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును సీరియల్ నంబర్ 4, కమలం పువ్వు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు పేర్కొన్నట్టు ఆ బాండు పేపర్‌లో ఉన్నది.. మరి ఈయన మాటలు విశ్వసించి గెలిపిస్తారో లేదో తెలియాలంటే కాస్త ఆగవలసిందే..

You may also like

Leave a Comment