కువైట్(Kuwait) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలను (Traffic Violations) అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలను ముమ్మరం చేసింది.
కువైట్‌లో ఆరు నెలల్లో 18,486 మంది ప్రవాసులను ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ చీఫ్ నవాఫ్ అల్ హయాన్ వెల్లడించారు. తాజాగా కువైట్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచనున్నట్లు తెలిపింది.
మరోవైపు, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో కువైట్ ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇక ప్రవాసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత అధికారులు ఏకంగా దేశం నుంచే బహిష్కరిస్తున్నారు. 4.6 మిలియన్ల జనాభా కలిగిన కువైట్‌లో గడిచిన పది నెలల్లో ఏకంగా 4.31లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం గమనార్హం.
ఈ 10 నెలల వ్యవధిలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా 165మంది మృతిచెందారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఏకంగా 15,556 ట్రాఫిక్ కేసులు కోర్టుకు వచ్చాయి. ఈ కేసులకు గాను న్యాయస్థానం ఉల్లంఘనదారులకు ఏకంగా 2.50 లక్షల కువైటీ దినార్ల(రూ.6.76కోట్లు) జరిమానా విధించింది.