Telugu News » YS Jagan : స్కిల్ కేసులో జగన్ సర్కార్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు..!!

YS Jagan : స్కిల్ కేసులో జగన్ సర్కార్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు..!!

బాబు స్కిల్ కేసులో సుప్రీం కోర్టు మొదట మధ్యంతర బెయిల్‌, ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది..

by Venu

ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో 17Aపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపి తన నిర్ణయాన్ని వెల్లడించింది.

Supreme Court BIG Shock to jagan

బాబు స్కిల్ కేసులో సుప్రీం కోర్టు మొదట మధ్యంతర బెయిల్‌, ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది..

మరోవైపు చంద్రబాబు ఏపీలో రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా కట్టడి చేయాలన్న సీఐడీ (CID) అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని కోర్టు తెలిపింది. ఈమేరకు చంద్రబాబు (Chandrababu)ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంలో అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కాగా.. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు (High Court) ఉత్తర్వులను, సుప్రీం కోర్టులో, ఏపీ సర్కార్ (AP Govt) సవాల్ చేసింది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సర్కార్ పిటిషన్ లో కోరింది.

You may also like

Leave a Comment