Telugu News » Winter: కమ్ముకున్న పొగమంచు.. గజగజ వణుకుతున్న భారత్..!

Winter: కమ్ముకున్న పొగమంచు.. గజగజ వణుకుతున్న భారత్..!

నైరుతి తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతంలో బుధవారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

by Mano
Winter: The mist that has spread.. India is trembling..!

భారత్‌ను పొగమంచు కప్పేసింది. దేశంలోని ఆయా రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. శీతాకాలం తీవ్రత పెరిగిపోతోంది. పొగమంచుతో రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో పొగ మంచు దట్టంగా ఉంటోంది.

Winter: The mist that has spread.. India is trembling..!

నైరుతి తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతంలో బుధవారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటు సాయంత్రం తర్వాత సూర్యోదయం వరకు పొగమంచు కొనసాగుతోంది. అదేవిధంగా పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పరిసర విదర్భ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీంతో ఢిల్లీలో చలి పెరుగుతుంది. రానున్న 24-48 గంటల్లో రాజధానిలో వర్షాలు కురిసే అవకాశం లేదు. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13.6 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. అయితే, రాజధాని ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీని కారణంగా పగటిపూట చలి నుండి కొంచెం ఉపశమనం ఉంటుంది.

ముంబైలో కూడా ఉష్ణోగ్రత 18 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండబోతోంది. దీంతో సాయంత్రం తర్వాత ఇక్కడ కూడా చలి ఎక్కువగా ఉంటుంది. బీచ్‌కు దగ్గర ఉండడంతో చెన్నెలో చలి ఎక్కువగా ఉండదు. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దేశంలోని కొండ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌ని ఎగువ ప్రాంతాల్లో రానున్న 24–48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment