Telugu News » Telangana : దగ్గర పడుతున్న ఎన్నికల టైమ్.. బయటపడుతున్న మనీ బ్యాగ్స్

Telangana : దగ్గర పడుతున్న ఎన్నికల టైమ్.. బయటపడుతున్న మనీ బ్యాగ్స్

చాలా మంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీ స్థాయిలో డబ్బులు పంచుతుండడంతో ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

by admin
ec-arrangements-for-elections

తెలంగాణ (Telangana) లో ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు దిగారు నేతలు. ఉన్న కొద్ది సమయంలో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీకి దిగారు. ఈ క్రమంలోనే మనీ బ్యాగ్స్ బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు సీజ్ అయింది. రెండు కార్లలో తరలిస్తున్న రూ.1.68 కోట్లను పోలీసులు (Police) స్వాధీనం చేసుకున్నారు. ఖాజాగూడలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

ec-arrangements-for-elections

పట్టుబడ్డ డబ్బు జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత అధికారులు, పోలీసులు డబ్బుల పంపకాలపై దృష్టి పెట్టారు. చాలా మంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీ స్థాయిలో డబ్బులు పంచుతుండడంతో ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

ఇటు, కరీంనగర్‌ శివారు కొత్తపల్లి దగ్గర హై టెన్షన్‌ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్‌ కి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు వెళ్లారు. కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. ప్రలోభాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని బండి ఆరోపించారు.

మరోవైపు, గ్రామాల్లో తమ పార్టీకి ఓటు వేయాలని దేవుడిపై ప్రమాణాలు చేయించుకుని మరీ నగదు పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇలా ఎవరైనా డబ్బులిస్తూ కనిపిస్తే వెంటనే ‘‘c vigil’’ యాప్‌ లో ఫిర్యాదు చేయాలని ఈసీ అధికారులు అంటున్నారు. ఈ యాప్ మొబైల్‌ లో ఇన్‌ స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయ్యాక డబ్బుల పంపిణీ చేస్తున్న ఫొటో లేదా వీడియోను అప్‌ లోడ్ చేయాలని సూచిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన 10 నిమిషాల్లోనే అధికారులు అక్కడి చేరుకుని వారిపై చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.

You may also like

Leave a Comment