Telugu News » Jeevan Reddy : గెలుపుపై కేసీఆర్ కు విశ్వాసం ఉంటే… జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…!

Jeevan Reddy : గెలుపుపై కేసీఆర్ కు విశ్వాసం ఉంటే… జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఓటింగ్ తర్వాత వచ్చిన సర్వేలను బట్టి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు.

by Ramu
congress mlc jeevan reddys sensational comments on kcr

కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఫలితాల తర్వాత ఓటమి పాలైతే మరుసటి రోజు కేబినెట్ (Cabinet) సమావేశమై మూకుమ్మడిగా గవర్నర్‌కు రాజీనామాలు అందజేయం ఆనవాయితీగా వస్తోందన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఫలితాల తర్వాత రోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.

congress mlc jeevan reddys sensational comments on kcr

ఓటింగ్ తర్వాత వచ్చిన సర్వేలను బట్టి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు. గెలుపుపై కేసీఆర్‌కు విశ్వాసం ఉంటే 4న సమావేశం ఏర్పాటు చేసుకోవడం అవసరం లేదన్నారు. ఉద్యమ ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా నెరవలేదన్నారు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.

కేసీఆర్ నియంతృత్వ ధోరణి ప్రజా వ్యతిరేకతకు కారణమని తాము భావిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల నెపంతో ప్రజలను మద్యానికి బానిసలుగా సీఎం కేసీఆర్ మార్చారంటూ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదట్లో మద్యం ఆదాయం 8వేల కోట్లుగా ఉండేదన్నారు. కానీ ఆ ఆదాయం 40వేల కోట్లకు చేరుకుందన్నారు.

ఇప్పుడు మద్యం అనేది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. ఓటర్లకు డబ్బులు పంచాము కాబట్టి ఫలితాలు అనుకూలంగా వస్తాయని కొంతమంది భ్రమలో ఉన్నారని అన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఓటర్లు అత్యంత తెలివైన విజ్ఞత కలిగిన వాళ్లన్నారు. ఇప్పుడు జరిగిందంతా సైలెంట్ ఓట్ అన్నారు. బీఆర్ఎస్ ఓటమి ముమ్మాటికి కేసీఆర్ ఫెయిల్యూర్ అని, అది ఆ పార్టీ ఎమ్మెల్యేల ఓటమిగా తాము భావించబోమని అన్నారు.

You may also like

Leave a Comment