Telugu News » Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.750 పెరిగి 58,450కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే ఈరోజు కిలోపై రూ. 1000 పెరిగి 83,500 వద్ద కొనసాగుతోంది.

by Mano
Gold Price: Huge increase in gold and silver prices.. How much..?

మార్కెట్‌లో బంగారం ధరలు(Gold Prices) భారీగా పెరిగాయి. ఈరోజు ఏకంగా తులంపై రూ.810 పెరిగి రూ. 63,760కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ.57,700 ఉండగా ఈరోజు రూ.750 పెరిగి 58,450కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ.82,500 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 పెరిగి 83,500 వద్ద కొనసాగుతోంది.

Gold Price: Huge increase in gold and silver prices.. How much..?

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ల బంగారం ధర రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,760 వద్ద కొనసాగుతోంది. మరి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయంటే.. చెన్నైలో 22 క్యారెట్‌ల బంగారం ధర రూ.59, 150ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,530 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.58,450 ఉండగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,780 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్‌ల బంగారం ధర రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,760 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరలూ భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.83,500 ఉండగా, విజయవాడ రూ.83,500 ఉంది. ఇక చెన్నై రూ.83,500 వద్ద పరుగులు పెడుతోంది. అదేవిధంగా ముంబై రూ.80,500 ఉండగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 వద్ద కొనసాగుతోంది.

You may also like

Leave a Comment