Telugu News » Vishal: భారీ వరదలు.. ప్రభుత్వ యంత్రాంగంపై హీరో విశాల్ ఆగ్రహం..!

Vishal: భారీ వరదలు.. ప్రభుత్వ యంత్రాంగంపై హీరో విశాల్ ఆగ్రహం..!

2015లో భారీ వరదల తర్వాత చెన్నైలో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదు కాగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో సినీ హీరో విశాల్(Actor Vishal) గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

by Mano
Vishal: Huge floods.. Hero Vishal is angry with the government machinery..!

మిచాంగ్ తుపాను(Michaung Cyclone) ప్రభావంతో చెన్నై, ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2015లో భారీ వరదల తర్వాత చెన్నైలో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదు కాగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో సినీ హీరో విశాల్(Actor Vishal) గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation)పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Vishal: Huge floods.. Hero Vishal is angry with the government machinery..!

ఈ మేరకు తన ఎక్స్(x) ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. విశాల్ ఏమన్నాడంటే.. ‘చెన్నై మేయర్ సహా అధికారులు అందరూ మీ మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా.. ఈ వరద మీ ఇళ్లలోకి రాదని అనుకుంటున్నా. మీ ఇళ్లకు పూర్తి విద్యుత్‌, ఆహారం ఉంటుంది. కానీ సాధారణ ఓటర్లకు అలాంటి పరిస్థితి లేదు..’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తుపాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నె కోసమా? సింగపూర్ కోసమా? అని విశాల్ ప్రశ్నించాడు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు 2015లో మేము రోడ్లపైకి వచ్చామని గుర్తుచేశాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేసేందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పాడు. అయితే 8 సంవత్సరాల తర్వాత మరింత అధ్వాన్నమైన పరిస్థితిని అధ్వాన్నమైన పరిస్థితిని చూడటం దయనీయంగా ఉందని విశాల్ వాపోయాడు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కచ్చితంగా ఆహారం, తాగునీరు అందిస్తూనే ఉంటాం. అయితే ఈ సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులందరూ బయటకు వచ్చి వారందరిని ఆదుకోవాలి. ఇలా రాస్తునందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. మీరు ఏదో అద్భుతాలు చేస్తారని నేను ఆశించడం లేదు. కానీ, ఓ సాధారణ వ్యక్తికి మీరు చేయాల్సిన డ్యూటీ గురించి చెప్తున్నాను’ అంటూ విశాల్ చెప్పుకొచ్చాడు. చెన్నై మేయర్ ప్రియా రాజన్‌ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విశాల్ కోరాడు.

You may also like

Leave a Comment