జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్(Indian Premier League)లో ఆడతానని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) అన్నాడు. ఆసీస్ వరల్డ్ కప్(World Cup) విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల ప్లేయర్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘బహుశా నా క్రికెట్ కెరీర్లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్ కావొచ్చు. నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతా’ అని తెలిపాడు. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీతో కలిసి భుజాలు కలపడం, వారితో మాట్లాడుకుంటూ మిగతా వాళ్ల ఆట కూడా చూడటం ఏ ఆటగాడైనా కోరుకునే గొప్ప అనుభూతి. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు వీలైనంత ఎక్కువ మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడతారని భావిస్తున్నాను’ అని మ్యాక్స్‌వెల్ తెలిపాడు.
కాగా, మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ(Royal Challengers Bangalore) జట్టు తరఫున వచ్చే ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.