Telugu News » Hamas War : గాజా అధిపతి ఇంటిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం..!!

Hamas War : గాజా అధిపతి ఇంటిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం..!!

హమాస్ గాజా అధిపతి యాహ్యా సిన్వర్‌ (Yahya Sinwar) నివాసాన్ని ఐడీఎఫ్ (IDF) బలగాలు చుట్టు ముట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. మరోవైపు సిన్వర్‌ నివాసాన్ని సమీపించినట్లు ఈనెల 5వ తేదీనే ఐడీఎఫ్ సూచనప్రాయంగా వెల్లడించింది. ఖాన్‌ యూనిస్‌లో భూతల దాడులను ఉద్ధృతం చేసినట్లు వీడియోను కూడా విడుదల చేసింది. అయితే రెండు రోజుల వ్యవధిలోనే సిన్వర్‌ నివాసాన్ని రౌండప్ చేసినట్టు వెల్లడించారు.

by Venu

హమాస్‌ (Hamas) మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇప్పటికే ఇరువర్గాలకు చెందిన ఎందరో మరణించారు. కాగా హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ (Israel).. ఆ సంస్థకు చెందిన అగ్రనాయకులను అంతమెుందించే విషయంలో ముందడుగు వేసింది.

హమాస్ గాజా అధిపతి యాహ్యా సిన్వర్‌ (Yahya Sinwar) నివాసాన్ని ఐడీఎఫ్ (IDF) బలగాలు చుట్టు ముట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. మరోవైపు సిన్వర్‌ నివాసాన్ని సమీపించినట్లు ఈనెల 5వ తేదీనే ఐడీఎఫ్ సూచనప్రాయంగా వెల్లడించింది. ఖాన్‌ యూనిస్‌లో భూతల దాడులను ఉద్ధృతం చేసినట్లు వీడియోను కూడా విడుదల చేసింది. అయితే రెండు రోజుల వ్యవధిలోనే సిన్వర్‌ నివాసాన్ని రౌండప్ చేసినట్టు వెల్లడించారు.

ఈమేరకు దేశంలో జరిగిన అనేక దాడుల వెనుక యాహ్యా సిన్వర్‌.. మాస్టర్‌ మైండ్‌గా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్‌ చెబుతోంది. 2015లో అమెరికా కూడా సిన్వర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అయితే ఖాన్‌ యూనిస్‌లోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించిన యాహ్యా సిన్వర్, హమాస్‌ గాజా అధిపతిగా 2017లో ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వర్ తన జీవితంలో సగ భాగం ఇజ్రాయెల్‌ జైళ్లలోనే గడిపాడు.

అంతే కాకుండా సిన్వర్ ఇద్దరు ఇజ్రాయెల్ సైనికుల అపహరణ, నలుగురు పాలస్తీనియన్ల హత్యకు పథకం రచించాడనే ఆరోపణలతో 1988లో జైలు పాలయ్యాడు. అదీగాక సిన్వర్ జైలుకు వెళ్లకముందు ఇజ్రాయెల్‌ నిఘా విభాగానికి సమాచారం చేరవేస్తున్న వారిని శిక్షించే అల్-మజ్ద్ భద్రతా యంత్రాంగానికి అధిపతిగా పనిచేశాడు. మొత్తానికి తాను విచారించిన వ్యక్తుల్లో సిన్వర్ అత్యంత క్రూరమైన వ్యక్తని ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌ బెట్‌ (Shin bet) మాజీ అధికారి అన్నారు.

You may also like

Leave a Comment