Telugu News » 300 Crores Seized: భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు.. లెక్కించలేక మొరాయించిన క్యాష్ మెషిన్లు..!

300 Crores Seized: భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు.. లెక్కించలేక మొరాయించిన క్యాష్ మెషిన్లు..!

పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలోని మద్యం కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ(IT) అధికారులు తనిఖీలు చేపట్టారు.

by Mano
300 Crores Seized: Heavily seized bundles of notes.. Cash machines screamed without being able to count..!

ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) నిర్వహించడం.. డబ్బును సీజ్ చేయడం తరచూ వార్తల్లో చూస్తేనే ఉన్నాం. అయితే ఇంతపెద్ద మొత్తంలో నగదు(Monedy) పట్టుబడడం ఈ మధ్య కాలంలో ఇదేనేమో. పట్టుబడిన నగదును చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించే క్రమంలో క్యాష్ మెషిన్లు సైతం మొరాయించాయి. ఇంతకీ ఆ మొత్తం నగదు ఎంత అంటే.. అక్షరాలా రూ.300కోట్లు.

300 Crores Seized: Heavily seized bundles of notes.. Cash machines screamed without being able to count..!

వివరాల్లోకి వెళ్తే.. పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలోని మద్యం కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ(IT) అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.300కోట్లకుపైగా నగదును పట్టుకున్నారు.

ఈ క్రమంలో బీరువాలో భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నారు. వీటిని బుధవారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.50కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు. నగదు లెక్కించే యంత్రాలను నిరాటంకంగా నడిపించేసరికి అవి పనిచేయడం లేదని వివరించారు. మరోవైపు, ఝార్ఖండ్లోని పలు మద్యం కంపెనీల్లోనూ దాడులు నిర్వహించింది ఐటీ శాఖ.

పన్ను ఎగవేతకు పాల్పడిన కంపెనీలతో సంబంధాలున్నాయంటూ పలు చిరువ్యాపారుల నివాసాలు, వ్యాపార కార్యాలయాలపై కూడా అధికారులు సోదాలు జరిపారు. బౌధ్ పురునా కటక్‌కు చెందిన వ్యాపారి అశోక్ కుమార్ అగర్వాల్ రైస్ మిల్లు, ఆయన నివాసంతో పాటు ఇతర ప్రదేశాలపై కూడా 30 మంది సభ్యులతో కూడిన ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు చేసింది.

బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పశ్చిమ ఒడిశాలో అతిపెద్ద స్వదేశీ మద్యం తయారీ, విక్రయ కంపెనీలలో ఒకటిగా ఉన్న బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన బలంగీర్ కార్యాలయంలో రూ.150 కోట్లకుపైగా అక్రమ నగదు దొరికింది. అలాగే సంబల్పుర్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా రూ.150 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

You may also like

Leave a Comment