Telugu News » CPI Ramakrishna: రేవంత్‌రెడ్డిని చూసైనా జగన్ సిగ్గుపడాలి: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna: రేవంత్‌రెడ్డిని చూసైనా జగన్ సిగ్గుపడాలి: సీపీఐ రామకృష్ణ

రేవంత్ సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారని రామకృష్ణ చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదిక కూల్చేశారని మండిపడ్డారు.

by Mano
CPI Ramakrishna: Jagan should be ashamed to see Revanth Reddy: CPI Ramakrishna

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (Telangana CM Revanth Reddy) చూసైనా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి(AP CM Jagan Reddy) సిగ్గుపడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై సెటైర్లు విసిరారు.

CPI Ramakrishna: Jagan should be ashamed to see Revanth Reddy: CPI Ramakrishna

రేవంత్ సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారని రామకృష్ణ చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.9 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదిక కూల్చేశారని మండిపడ్డారు. జగన్ నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి జయలలిత పేరుతోనే పలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని రామకృష్ణ చెప్పారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిలో మార్పు తెచ్చుకుని, ప్రజారంజకంగా పాలన చేయాలని హితవు పలికారు. జగన్ పర్యటనలన్నీ పోలీసుల మోహరింపుల మధ్య, పరదాలు, ముళ్లకంచెల మాటున సాగుతున్నాయని రామకృష్ణ విమర్శించారు.

నాలుగున్నర సంవత్సరాల్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు కలిసేందుకు జగన్ అనుమతించలేదని విమర్శించారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఒక్కరే భారీ మెజార్టీతో గెలుపొందారు.

You may also like

Leave a Comment