Telugu News » Union Minister: రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Union Minister: రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

త్వరలోమరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

by Mano
Union Minister: Do not link railways with politics: Union Minister Ashwini Vaishnav

రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోమరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అదేవిధంగా విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Union Minister: Do not link railways with politics: Union Minister Ashwini Vaishnav

వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధి కోసం రూ. 8 వేల 406 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయింపే ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమిని అప్పగిస్తే నేటి నుంచి పనులు ప్రారంభిస్తామని అన్నారు.

52ఎకరాల భూమి అవసరమవుతుందని గుర్తించామన్నారు. డిజైన్లు, రూ.106 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భూమి కేటాయింపు విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. మరోవైపు, 5G సేవల విస్తరణ చాలా వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీపావళి నాటికి బీఎస్ఎన్ ఎల్ 5G సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అందులో ఎక్కువ ఉత్తరాంధ్రాలోనే పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

అదేవిధంగా విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. మానవ తప్పిదం వల్లే కంటకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 40 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే, ఈ రైలు ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment