Telugu News » BJP : బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్​ రావు..!!

BJP : బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్​ రావు..!!

మజ్లిస్​తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదని రఘునందన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం పట్ల బీజేపీ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

by Venu

తెలంగాణ (Telangana)లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై పలువురు బీఆర్ఎస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. హస్తాన్ని ఇరుకున పెట్టడానికి కుట్ర జరుగుతున్నదని కొందరు కాంగ్రెస్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

raghunandan-rao

మరోవైపు కడియం శ్రీహరి (Kadiam Srihari) చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్​ రావు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటిన స్థానాలు గెలుచుకుందని ఆరోపించిన కడియం శ్రీహరి.. ఏడాదిలో బీఆర్ఎస్ (BRS)..బీజేపీ (BJP)..ఎంఐఎం పార్టీలను కలుపుకొని కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనడం ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేలా ఉన్నాయని రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు.

మజ్లిస్​తో అంటకాగే ఏ పార్టీతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లదని రఘునందన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం పట్ల బీజేపీ శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై టీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధిస్తుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. అదీగాక తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సృష్టం చేశారు.. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. సొంత ఇలాకా హుజురాబాద్‌తో పాటు.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన ఈటల రాజేందర్.. ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు.

You may also like

Leave a Comment