Telugu News » Weather Report : ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ తుపాన్ గా మారనున్న అల్పపీడనం..!!

Weather Report : ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ తుపాన్ గా మారనున్న అల్పపీడనం..!!

ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ వైపుగా 50 శాతం వచ్చే ఛాన్స్ కనిపిస్తోందని.. ఒకవేళ ఏపీ వైపుగా వస్తే డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ వర్షాల వల్ల భారీ ముప్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని అందుకే రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

by Venu
ts weather three days rain forecast to telanagana imd

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకృతి విపత్తుతో ఇప్పటికే అల్లాడిపోతోంది. కాలం లేని సమయంలో పడే వర్షాల వల్ల రైతులతో పాటు సామాన్య జనం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇప్పటికే ఏపీని తుపాన్ లు ముంచెత్తుతుండగా తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. డిసెంబర్ 16న బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడి..18వ తేదీకి అది అల్పపీడనంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

2 states Weather Report

ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ వైపుగా 50 శాతం వచ్చే ఛాన్స్ కనిపిస్తోందని.. ఒకవేళ ఏపీ వైపుగా వస్తే డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ (Meteorology Department) అధికారులు. ఈ వర్షాల వల్ల భారీ ముప్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని అందుకే రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా (North coast) ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

మరోవైపు ఉత్తర కోస్తా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, వాయువ్య గాలులు వీస్తున్నాయని అమరావతి (Amaravathi) వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం అల్పపీడన గమనం శ్రీలంక – తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడనం భారీ తుపాన్ గా ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి..

You may also like

Leave a Comment