Telugu News » Revanth Reddy : గత ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోన్న కాంగ్రెస్.. సీఎం సంచలన నిర్ణయం..!!

Revanth Reddy : గత ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోన్న కాంగ్రెస్.. సీఎం సంచలన నిర్ణయం..!!

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చాలా మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కానీ ఇంకా కొందరు కొనసాగుతూ ఉండడంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

by Venu
revanth reddys open letter to the people of telangana

తెలంగాణ (Telangana)లో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం జారీచేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కాగా ఈ నెల 7వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు.

Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

మరోవైపు ఇప్పటి వరకి చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఆఫీసుల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని శాంతికుమారి (Shantikumari) స్పష్టం చేశారు. ఈమేరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చాలా మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కానీ ఇంకా కొందరు కొనసాగుతూ ఉండడంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తోన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం.. రాష్ట్రంలోని మొత్తం 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. మరోవైపు ఇప్పటివరకు నామినేటెడ్ పదవులు (Nominated Posts) అనుభవిస్తున్న వారు.. రాజీనామా చేయకుండానే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది..

ఇక నామినేటెడ్ పదవుల నుంచి తప్పుకునే వారిలో.. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాసయాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెల-మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్ రజనితో పాటు మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.

You may also like

Leave a Comment