Telugu News » Shabarimala: శబరిమల ఆలయం వద్ద అపశృతి.. క్యూ లో కుప్పకూలి బాలిక మృతి..!

Shabarimala: శబరిమల ఆలయం వద్ద అపశృతి.. క్యూ లో కుప్పకూలి బాలిక మృతి..!

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోగా అప్రమత్తమైన ఆలయ అధికారులు హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

by Mano
Shabarimala: Chaos at Sabarimala temple.. Girl collapses in queue and dies..!

కేరళ(Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం(Sabarimala Ayyappa Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్న ఓ బాలిక కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోగా అప్రమత్తమైన ఆలయ అధికారులు హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Shabarimala: Chaos at Sabarimala temple.. Girl collapses in queue and dies..!

ఆలయంలో మృతిచెందిన బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ సమయం క్యూలైన్‌లో వేచి ఉన్న బాలిక ఒక్కసారిగా పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దీంతో కొండ మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసింది.

శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17వ తేదీ నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంటోంది.

శబరిమలలో రద్దీ పెరుగుదలపై కేరళ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10వేలకు తగ్గించారు. అదేవిధంగా రోజువారీ భక్తుల సంఖ్య పరిమితిని 90 వేల నుంచి 80 వేలకు కుదించారు. భద్రతా చర్యలను పటిష్టం చేస్తూ ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు.

You may also like

Leave a Comment