Telugu News » Bhatti Vikramarka : రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది..!!

Bhatti Vikramarka : రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చింది..!!

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను ప్రజల కోసమే తీర్చిదిద్దుతామన్నారు. ఆరు హామీల్లో కేవలం రెండు రోజుల్లోనే రెండు హామీలు ప్రారంభమయ్యాయని.. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.. బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రజల ముందుకు సాక్షాలతో తీసుకొస్తామని భట్టి విక్రమార్క అన్నారు..

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.. వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై భారం అధికంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం పరిపాలన, కొత్త ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారిందని అనుకొంటున్నారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నిధులు కావాలి.. ఆ నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితి తెలిసేలా శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఎంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారని.. అంతే బాధ్యతగా తమ ప్రభుత్వం నడుచుకోంటుందని తెలిపారు.. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఉన్నతి పదవి చేపట్టానని తెలిపిన భట్టి విక్రమార్క.. మధిర ప్రజలందరి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకుంటే.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్ర సంపద అంతా దోపిడీ చేసి.. రాష్ట్రాన్ని 70 ఏళ్ళు వెనక్కి నెట్టారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ (KCR) హయాంలో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడి, రాష్ట్ర భూ సంపద అంతా కబ్జాలకు గురైందని భట్టి విక్రమార్క మండిపడ్డారు..

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను ప్రజల కోసమే తీర్చిదిద్దుతామన్నారు. ఆరు హామీల్లో కేవలం రెండు రోజుల్లోనే రెండు హామీలు ప్రారంభమయ్యాయని.. 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.. బీఆర్ఎస్ చేసిన అవినీతిని ప్రజల ముందుకు సాక్షాలతో తీసుకొస్తామని భట్టి విక్రమార్క అన్నారు..

You may also like

Leave a Comment