Telugu News » Fake ID Cards: రెచ్చిపోతున్న నకిలీ రాయుళ్లు.. ‘మహాలక్ష్మి’ కార్డుల పేరుతో వసూళ్లు..!

Fake ID Cards: రెచ్చిపోతున్న నకిలీ రాయుళ్లు.. ‘మహాలక్ష్మి’ కార్డుల పేరుతో వసూళ్లు..!

మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)పై కన్నేశారు కంత్రీగాళ్లు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రతీ నెలా నగదు చెల్లింపునకు, గ్యాస్ సిలిండర్, మహిళలకు అందించే పథకాలకు ‘మహాలక్ష్మి’ కార్డును ప్రభుత్వం జారీ చేయనుంది. దీన్ని నకిలీ రాయుళ్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.

by Mano
Fake ID Cards: Exciting fake stones.. Collecting in the name of 'Mahalakshmi' cards..!

నకిలీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. కేటుగాళ్లు మరో కొత్తదారిని ఎంచుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)పై కన్నేశారు కంత్రీగాళ్లు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ప్రతీ నెలా నగదు చెల్లింపునకు, గ్యాస్ సిలిండర్, మహిళలకు అందించే పథకాలకు ‘మహాలక్ష్మి’ కార్డును ప్రభుత్వం జారీ చేయనుంది. దీన్ని నకిలీ రాయుళ్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.

Fake ID Cards: Exciting fake stones.. Collecting in the name of 'Mahalakshmi' cards..!

ప్రభుత్వం ఇంకా కార్డుల జారీని చేపట్టకముందే ఈ నకిలీ ముఠా రెచ్చపోతోంది. నకిలీ మహాలక్ష్మి కార్డులను(Fake Cards) ముద్రించి ఒక్కో కార్డును రూ.100లకు విక్రయిస్తున్నారు. ఈ కార్డు ఉంటేనే ఆర్టీసీ ఉచితంగా ప్రయాణిస్తారంటూ పల్లెల్లోని మహిళలకు చెబుతూ కార్డులను బాహాటంగా అమ్మేస్తున్నారు. గులాబీ రంగులో ఉన్న నకిలీ కార్డుపై కాంగ్రెస్ గ్యారెంటీకార్డు అని ముద్రించారు.

అదే విధంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ప్రతినెలా 2 వేల 500, గ్యాస్ సిలిండర్ రూ.500 అని ముద్రించి ఉంది. ఈ కార్డుపై సోనియాగాంధీ పేరుతో సంతకం కూడా క్రియేట్ చేశారు కేటుగాళ్లు. కాంగ్రెస్ పార్టీ గుర్తు, సోనియాగాంధీ ఫొటోలు ఉన్నాయి. కార్డుకు రెండో వైపు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫొటో, పార్టీ గుర్తు ఉంది. ఆ పక్కనే క్యూ ఆర్ కోడ్ కూడా పెట్టారు.

అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం మహాలక్ష్మి కార్డులకు సంబంధించి ఎలాంటి విధివిధానాలను రూపొందించలేదు. దీనికి కొంత సమయం పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న మహాలక్ష్మికార్డులు అన్నీ నకిలీవి అని.. ఎవరూ నమ్మొద్దని.. వాటికి డబ్బులు చెల్లించవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నకిలీ కార్డులు ముద్రించి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

You may also like

Leave a Comment