Telugu News » Gutha Sukender Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదు..!!

Gutha Sukender Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేయలేదు..!!

జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని.. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, శాశ్వతంగా ఎవరికీ అధికారం ఉండదని సుఖేందర్ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత పాలకులు ఆలోచించాలని.. విమర్శలకు ఇది సమయం కాదని తెలిపారు..

by Venu
They are the reason BRS is in this predicament.. Gutta Sukhender Reddy's sensational comments!

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. బీఆర్ఎస్ (BRS)లోని పలువురు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.. అయితే ఈ వార్తల్లో పేరు వినిపించిన నేతలు, తర్వాత పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వడం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సెగ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని (Gutha Sukender Reddy) తాకింది.

ఆయన పార్టీ మారుతోన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను పార్టీ మారడం లేదని. ఆ అవసరం కూడా తనకు లేదని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. విలేకరుల సమావేశంలో మాట్లాడిన సుఖేందర్ రెడ్డి.. నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగడం విచారకరం అన్నారు.. రాజ్యాంగబద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవిలో ఉన్న తనకు ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు.. చట్టబద్ధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ..
ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలని, ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని సుఖేందర్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ (Congress)పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, తాను అనుకోవడం లేదని, ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ పదవికి గండంగా మారిందని సుఖేందర్ తెలిపారు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని.. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, శాశ్వతంగా ఎవరికీ అధికారం ఉండదని సుఖేందర్ వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రస్తుత పాలకులు ఆలోచించాలని.. విమర్శలకు ఇది సమయం కాదని తెలిపారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం ఆనందంగా ఉందని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు..

You may also like

Leave a Comment