Telugu News » IPL 2024: ఐపీఎల్ వేలంలో 333మంది పోటీ.. భారత్ నుంచి ఎంతమందంటే?

IPL 2024: ఐపీఎల్ వేలంలో 333మంది పోటీ.. భారత్ నుంచి ఎంతమందంటే?

భారత్ ప్లేయర్ల(Team India)తో పాటు ఇటీవల వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ టీమ్ ప్లేయర్లు(AUS players) ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 333 మంది ప్లేయర్లు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

by Mano
IPL 2024: 333 contestants in IPL auction.. How many are from India?

ఐపీఎల్(IPL)- 2024 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు తుది జాబితా సిద్ధం చేశారు. అందులో భారత్ ప్లేయర్ల(Team India players)తో పాటు ఇటీవల వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ టీమ్ ప్లేయర్లు(AUS players) ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 333 మంది ప్లేయర్లు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

IPL 2024: 333 contestants in IPL auction.. How many are from India?

దుబాయ్ కోకాకోలా ఎరినా వేదికగా ఈనెల 19న జరిగే ఈ వేలాన్ని నిర్వహిస్తున్నారు. 77 ఖాళీలు భర్తీ చేసుకోవడానికి ఫ్రాంచైజీలు వీరిలోని అత్యుత్తమ ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. ఈ లిస్టులో కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో భారత ప్లేయర్లు హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌పటేల్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్ యంగ్ సెన్సేషన్ రచిన్ రవీంద్రపై కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే అతడి బేస్ ప్రైజ్ రూ.50లక్షలుగా ఉంది. కానీ, అతడు వేలంలో పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి. అత్యధిక ధరకు అమ్ముడైనా ఆశ్చర్యం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్‌లకు ఈ వేలం మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. వీళ్లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు.

ఐపీఎల్ పాలకవర్గం మొత్తం 1166 మందితో కూడిన లిస్ట్ ‌ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా తుది జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి.

మొత్తం 77 మంది నుంచి గరిష్ఠంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశముంది. కనీస ధర రూ. 1.5 కోట్ల ప్లేయర్ల లిస్టులో మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్), వానిందు హసరంగ (శ్రీలంక), క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), టామ్ కరన్ (ఇంగ్లాండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), న్యూజిలాండ్ ప్లేయర్లు టిమ్ సౌథీ, కొలిన్ మున్రో ఉన్నారు.

అదేవిధంగా కనీస ధర రూ.1కోటి ప్లేయర్లలో న్యూజిలాండ్ నుంచి ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా నుంచి డీఆర్సీ షాట్, ఆస్టన్ టర్నర్, ఆస్టన్ ఏగర్, సౌత్ ఆఫ్రికా నుంచి డేవిడ్ వీస్, వెయిన్ పార్నెల్, డ్వెన్ ప్రిటోరియస్ ఉన్నారు. ఇంగ్లండ్ ప్లేయర్లలో గాస్ అట్కిసన్, శామ్ బిల్లింగ్స్ ఉన్నారు. వెస్టిండీస్ నుంచి రోమన్ పావెల్, అల్జారీ జోసెఫ్ చోటు దక్కించుకున్నారు.

You may also like

Leave a Comment