Telugu News » AP High Court: మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష.. లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు..!

AP High Court: మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష.. లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు..!

గుంటూరు(Guntur) మున్సిపల్ కమిషనర్‌(Municipal Commissioner) కీర్తికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) నెల రోజుల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది.

by Mano
AP High Court: Jail sentence for Municipal Commissioner.. High Court orders to surrender..!

ఏపీలో హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ అధికారులు తరచూ కోర్టు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారికి జైలు శిక్ష, జరిమానాలు విధించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. తాజాగా గుంటూరు(Guntur) మున్సిపల్ కమిషనర్‌(Municipal Commissioner) కీర్తికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) నెల రోజుల జైలు శిక్ష విధించింది.

AP High Court: Jail sentence for Municipal Commissioner.. High Court orders to surrender..!

జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది. వచ్చే నెల జనవరి 2వ తేదీ 2023న హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించకపోవటంతో కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు ఇచ్చింది.

సత్రంలో ఎలాంటి లీజ్ చెల్లించకుండా పాఠశాల నడుపుతున్నారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‌లకు రూ.25లక్షలు చెల్లించాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ ప్రీతి పట్టించుకోలేదు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ధిక్కారణ మేరకు కీర్తికి శిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు.

సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు వివిధ కేసుల్లో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారు. గతంలో ఇలాంటి కేసుల్లో హైకోర్టు జైలు శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వారు హైకోర్టు ముందు హాజరై తమ తప్పును ఒప్పుకోవడంతో జైలు శిక్ష కాకుండా సాధాణ శిక్షలు అమలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

You may also like

Leave a Comment