Telugu News » Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..!

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం..!

భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే శాఖ ‘x’(ట్విట్టర్)లో షేర్ చేసింది. శబరిమల అయ్యప్ప స్వామి(Ayyapa swami)ని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

by Mano
Sabarimala: Good news for Ayyappa devotees.. South Central Railway's key decision..!

అయ్యప్పమాల వేసుకున్న భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala)కు అత్యధికంగా వెళ్తుంటారు. మరికొందరు అయ్యప్ప మాల వేసుకోకున్నా అయ్యప్ప దర్శనార్థం శబరిమలకు పయనమవుతారు. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే శాఖ ‘x’(ట్విట్టర్)లో షేర్ చేసింది.

Sabarimala: Good news for Ayyappa devotees.. South Central Railway's key decision..!

శబరిమల అయ్యప్ప స్వామి(Ayyapa swami)ని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని వివరించారు.

శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే..

డిసెంబర్‌ 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సికింద్రాబాద్‌- కొల్లాం ప్రత్యేక రైలు (07111), డిసెంబర్‌ 29, జనవరి 5,12,19 తేదీల్లో కొల్లాం- సికింద్రాబాద్‌ (07112) రైలు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో కాకినాడ టౌన్‌- కొట్టాయం (07113), డిసెంబర్‌ 30, జనవరి 6,13,20 తేదీల్లో కొట్టాయం-కాకినాడ టౌన్‌ (07114) శబరిమలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అదేవిధంగా జనవరి 2న సికింద్రాబాద్‌-కొట్టాయం (07117), జనవరి 4న కొట్టాయం-సికింద్రాబాద్‌ (07118), జనవరి 6, 13 తేదీల్లో సికింద్రాబాద్‌ -కొట్టాయం (07009), జనవరి 8,15 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07010)ను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment