Telugu News » Mallareddy : మల్లారెడ్డి వంతు.. అట్రాసిటీ కేసు

Mallareddy : మల్లారెడ్డి వంతు.. అట్రాసిటీ కేసు

కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గంటల ఎస్టీ(లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని, కుట్రతో మోసగించి కాజేసారనేది బాధితుడి ఆవేదన.

by admin
SC ST Case Against MLA Malla Reddy

– చిక్కుల్లో గులాబీ నేతలు
– ఇప్పటికే లీజు విషయంలో జీవన్ రెడ్డికి షాకులు
– మల్లారెడ్డిపై కొత్తగా అట్రాసిటీ కేసు
– కేశవరంలో భూకబ్జా వివాదం
– శామీర్‌ పేట్ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు

తెలంగాణ (Telangana) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి చవిచూసింది. హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేద్దామనుకున్న కేసీఆర్ (KCR) ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆర్మూర్ గడ్డపై పదేళ్లు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి (Jeevan Reddy) మాజీ అవ్వగానే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సర్కార్ మారగానే సీన్ రివర్స్ అయ్యింది. ప్రభుత్వ భూమి లీజు విషయంలో నోటీసులు అందుకున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) వంతు వచ్చింది.

SC ST Case Against MLA Malla Reddy

మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ (Medchal) జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశారని శామీర్‌ పేట్ పోలీస్‌ స్టేషన్‌ లో భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో 47 ఎకరాల 18 గంటల ఎస్టీ(లంబాడీల) వారసత్వ భూమిని మల్లారెడ్డి బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని, కుట్రతో మోసగించి కాజేసారనేది బాధితుడి ఆవేదన. పోలీసులు విచారణ జరిపి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువు శ్రీనివాస్ రెడ్డి , కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త సహా మొత్తం తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.

బాధితుడు బిక్షపతి చెబుతున్న దాని ప్రకారం… వారసత్వంగా వచ్చిన ఈ భూమి ఆరుగురిపై ఉంది. దీనిపై కన్నేసిన మల్లారెడ్డి ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాస్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి , మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహారామిరెడ్డి, లక్ష్మమ్మ, నేహా రెడ్డిలను పంపి.. తమకు మాయ మాటలు చెప్పి భూమిపై హక్కులు కోల్పోయేలా చేశారని చెబుతున్నాడు. తమకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున డబ్బు ఇచ్చారని.. మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు శామీర్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో అక్రమంగా 47.18 ఎకరాల భూమిని వాళ్ల పేరుపై రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే కేసు పెట్టినట్టు తెలిపాడు.

You may also like

Leave a Comment