Telugu News » Joe Biden: జో బైడెన్‌కు షాక్.. ట్రంప్‌ ప్రోత్సాహంతో ఏకమైన రిపబ్లికన్లు..!

Joe Biden: జో బైడెన్‌కు షాక్.. ట్రంప్‌ ప్రోత్సాహంతో ఏకమైన రిపబ్లికన్లు..!

రిపబ్లికన్లు(Republicans) బైడెన్‌పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు బయటపడనప్పటికీ అందుకు అనుకూలంగా ఓటు వేశారు.

by Mano
Joe Biden: Shock for Joe Biden.. Republicans united with Trump's encouragement..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)కు షాక్ తగిలింది. ఆయనపై అభిశంసన విచారణ(అభియోగాలను ప్రారంభించే ప్రక్రియ)కు రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్లు(Republicans) బైడెన్‌పై అభిశంసన విచారణకు అంగీకారం తెలిపారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు బయటపడనప్పటికీ అందుకు అనుకూలంగా ఓటు వేశారు.

Joe Biden: Shock for Joe Biden.. Republicans united with Trump's encouragement..!

సెనేట్ విచారణలో బైడెన్ దోషిగా తేలితే ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలిగించవచ్చు. అయితే అందుకు సుధీర్ఘ సమయం పడుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న బైడెన్‌కు ఇది ఇబ్బందికరమేనని అంతా భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉండగా రెండు సార్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.

విచారణ వేగంగా జరగడం లేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని ప్రతినిధుల సభ స్పీకర్ మైక్‌ జాన్సన్ చెప్పుకొచ్చారు. తదుపరి చేపట్టాల్సింది అభిశంసన ప్రక్రియేనని వ్యాఖ్యానించారు. ‘పొలిటికల్ స్టంట్’ అయితే, శ్వేతసౌధం మాత్రం ఈ ప్రక్రియను అర్థరహితమైనదిగా అభివర్ణించింది.

అయితే సభలో డెమోక్రాట్లు సైతం విచారణ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ట్రంప్ న్యాయపరంగా అనేక చిక్కుల్లో ఉన్నారని, దీని నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు అభిశంసన ప్రక్రియను ముందుకు తెచ్చారని మండిపడ్డారు. ‘ఇదంతా రాజకీయ స్టంట్. దీనికి విశ్వసనీయత, న్యాయబద్ధత లేవనిని డెమొకాట్ పతినిధి జిమ్ మెక్ గవర్న్ ఆరోపించారు.

హంటర్ బైడెన్ విదేశీ వ్యాపార ఒప్పందాల వల్ల జో బైడెన్ వ్యక్తిగతంగా లబ్ధి కలిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 40 వేల పేజీల బ్యాంకు రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లు, అధికారిక పత్రాలను సేకరించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష హోదాలో బైడెన్ అవినీతికి పాల్పడ్డట్లు కానీ, లంచం తీసుకున్నట్లు కానీ ఎలాంటి ఆధారాలు విచారణలో లభించలేదు.

మరోవైపు, బైడెన్ కుటుంబ సభ్యుల వ్యాపారాల చుట్టూ ఉన్న వివాదాలపై ఏడాదిగా విచారణ జరుగుతోంది. అయితే, ఇందులో ఏమాత్రం పురోగతి లేదని భావిస్తున్న రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ వ్యాపార ఒప్పందాలపై పార్లమెంట్‌లో విచారణ జరుపుతున్నారు.

You may also like

Leave a Comment